బెంగళూరులో సినీ పార్టీలో 7 కోట్ల రూపాయల దోపిడి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 23 (అఖండ భూమి న్యూస్);
బెంగళూరులో సినీఫక్కీలో రూ.7 కోట్ల దోపిడీ, పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారంటే….దోపిడీ, నగదు రికవరీ దోపిడీకి గురైన నగదులో పెద్దమొత్తాన్ని రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. బెంగళూరులో బ్యాంకుల మధ్య నగదును రవాణ చేస్తున్న వ్యాన్ నుంచి 7.11 కోట్ల రూపాయల నగదును దొచిన కేసును చేధించామని, ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేశామని బెంగళూరు పోలీసులు తెలిపారు. దోపిడీ నగదులో మొత్తం 6.29 కోట్లు రికవరీ చేసినట్టు చెప్పారు. దర్యాప్తు సరైన దిశలో ఉందని, మిగిలిన నగదు మొత్తంతో పాటు ఈ నేరానికి పాల్పడిన ఇతర నిందితులను త్వరలో పట్టుకుంటామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అరెస్ట్ అయిన ఆరుగురిలో సెక్యూరిటీ గార్డు గోపాల్ ప్రసాద్, క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (సీఎంఎస్)లో పనిచేసే జేవియర్, బెంగళూరు పశ్చిమప్రాంతంలోని పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహించే అన్నప్ప నాయక్ ఉన్నారు. దోపిడీ జరిగిన తీరు, నిందితులను పట్టుకున్న వైనాన్ని పోలీసు కమిషనర్ సీమంత్ సింగ్ వివరించారు 200మందితో వేట నిందితులను పట్టుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాలో 200మంది పోలీసులతో గాలింపు జరిపారు. నగదు దోచుకున్న తరువాత నిందితులు తమవాహనాన్ని మార్చేశారు. నకిలీ నెంబర్ ప్లేట్లు ఉపయోగిస్తూ సీసీటీవీ కెమెరాల నిఘా లేనిచోటా, ఉన్నా పెద్దగా పట్టించుకోని చోట ఆగి క్యాష్ బాక్సులను మార్చుకున్నారు. ఈ దోపిడీ బుధవారం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాలకు జరిగిందని పోలీస్ కమిషనర్ చెప్పారు. అయితే సీఎంఎస్ సంస్థ ఈ విషయాన్ని మధ్యాహ్నం 1గంట 20 నిమిషాలకు పోలీసులకు తెలిపింది. దొంగలను పట్టుకోవడానికి పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అసలేం జరిగింది, ఎలా జరిగింది? బెంగళూరులో బ్యాంకు బ్రాంచీల మధ్య నగదును రవాణా చేస్తున్న వ్యాన్‌ను రిజర్వ్ బ్యాంక్ అధికారులమంటూ ఆపిన కొందరు సాయుధ వ్యక్తులు 7 కోట్ల రూపాయల నగదును దోచుకున్నారని పోలీసులు చెప్పారు. బెంగళూరు నడిబొడ్డున ఈ దోపిడీ చేసిన వారి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపులు చర్యలు మొదలుపెట్టారు.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


