*శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయం 24 వ వార్షికోత్సవ కరపత్రాల ఆవిష్కరణ…
ఈ మంగళవారం రోజున మహా అన్న ప్రసాద కార్యక్రమం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 24 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో ఈ మంగళవారం రోజున 24 వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ సేవకులు మాట్లాడుతూ 24 వ వార్షికోత్సవం సందర్భంగా ఐశ్వర్యం,ఆరోగ్యం, వివాహం,సంతాన ప్రాప్తి,వ్యాపార అభివృద్ధించడం కొరకు శ్రీ పరంజ్యోతి భగవతి ఆలయంలో పూజా కార్యక్రమాలను ఉదయం 10: 30 ల నుండి నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని అన్నారు. మూడువేల మందికి అన్న ప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరించిన చిలువేరి మారుతి శ్రీదేవి దంపతులకు కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివచ్చి శ్రీ పరంజ్యోతి అనుగ్రహం పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్కే విద్యాసంస్థల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి,ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,ఎర్రం విజయ్ కుమార్, డాక్టర్ బాలు,అధ్యాపకులు నవీన్, గోవర్ధన్ రెడ్డి లు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


