మహిళల ఆర్థికంగా కోటేశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..! రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..

మహిళల ఆర్థికంగా కోటేశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..!

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 24 (అఖండ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్ర మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటేశ్వరులను చేయడమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ సీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలు, ఆర్థిక, సామాజిక ప్రగతి రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని తెలిపారు. మహిళలు టెక్నాలజీ కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే గ్రామీణ స్థాయి నుండి మహిళలను బలోపేతం చేయడానికి ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఇందిరా క్రాంతి పథకం ద్వారా మహిళల అభివృద్ధికి తోడ్పడిందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి సన్న బియ్యం అందిస్తుందని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి డ్వాక్రా మహిళలను చైతన్యం చేసి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి మహిళా సంఘాలకు వివిధ పథకాలను ప్రవేశపెట్టి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలు మహిళల పేరిటనే వచ్చే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నో పథకాలను నిరుపేద కుటుంబాలకు అందించి వారి బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఇల్లు లేని వారికి ఇండ్లు ఇవ్వలేదని ప్రతి పేద కుటుంబానికి కనీస గూడు ఉండాలని ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఉద్దేశంతోనే మహిళలందరికీ డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేసి ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండానే మోసపూరిత వాగ్దానాలతో పది సంవత్సరాలు దోచుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు మహిళలు అండగా నిలిచి మరిన్ని అభివృద్ధి పథకాలకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ చీరలను నాణ్యతతో కూడిన చీరలను అందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంతరెడ్డి, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు ,మాజీ సర్పంచులు ఐరన్ నరసయ్య, నల్లపూ అంజలి శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఏపీఎం రాజు , మహిళా సమాఖ్య ప్రతినిధులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!