ఇద్దరు కానిస్టేబుల్ కుటుంబాలకు ఎస్బిఐ పోలీస్ సాలరీ కింద 1 కోటి ఇన్సూరెన్స్ చెక్కులు అందించిన ఎస్పీ…

ఇద్దరు కానిస్టేబుల్ కుటుంబాలకు ఎస్బిఐ పోలీస్ సాలరీ కింద 1 కోటి ఇన్సూరెన్స్ చెక్కులు అందించిన ఎస్పీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 24 (అఖండ భూమి న్యూస్);

• *విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఎస్బిఐ పోలీస్ సాలరీ ప్యాకేజ్ కింద ఒక్కో కుటుంబానికి ₹1 కోటి ఇన్సూరెన్స్ చెక్కులను అందజేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఎస్బిఐ రీజినల్ మేనేజర్లు సోమవారం అందజేశారు.

పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు.

ఈ సంవత్సరం జరిగిన రెండు దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందజేశారు.

విధి నిర్వహణలో మార్చి నెలలో గాంధారి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్ రాత్రి విధుల్లో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినాడు. అదే విధంగా ఏప్రిల్ నెలలో పిట్లం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కె. భూచ్చయ్య చారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోలీస్ సాలరీ ప్యాకేజ్ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఎస్బిఐ రీజినల్ మేనేజర్ వారి బృందంతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ.

జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ పోలీస్ సిబ్బంది తమ శాలరీ ఖాతాలను పోలీస్ సాలరీ ప్యాకేజ్‌లోకి మార్చుకోవడం ఎంతో అవసరమని సూచించారు. అనుకోని ఘటనల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించేందుకు ఈ ప్యాకేజీ ఎంతగానో సహాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే, ఇన్సూరెన్స్ రూపంలో లభించే మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలు మరియు కుటుంబ అవసరాల కోసం సమర్థవంతంగా వినియోగించుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

విధి నిర్వహణలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవచేసిన కానిస్టేబుల్లు స్వర్గీయ రవికుమార్ ,భూచ్చయ్య చారి సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబాల భవిష్యత్తు భద్రత కోసం వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కేవలం రెండు నెలల్లోనే రవికుమార్ ,భార్య సౌఖ్య గారిని డిపిఓలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు.

అలాగే, స్వర్గీయ రవికుమార్ గారి భార్య సౌఖ్య గారు మరియు బుచ్చయ్య చారి గారి భార్య రుక్మిణి ఎస్బిఐ బ్యాంక్ ద్వారా తమ కుటుంబాలకు అందిన ఆర్థిక సహాయానికి జిల్లా ఎస్పీ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి గారు, ఎస్బిఐ బ్యాంకు అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయల అడ్మినిస్ట్రేటివ్ అధికారి కే. లింగనాయక్ , సూపరింటెండెంట్ ఎస్‌.కే. జమీల్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూధన్, జూనియర్ అసిస్టెంట్ అపూర్వ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!