స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..!

మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరల పంపిణీ…
రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 25 (అఖండ భూమి న్యూస్);
స్వయం సహాయక మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు లక్ష్యంగా పనిచేస్తుందని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్l లు అన్నారు. మంగళవారం కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బిక్కనూరు మండల కేంద్రంలోని ఎస్సీ గార్డెన్లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలు అందించి మాట్లాడారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోక మహిళా సంఘాలను, మహిళల అభ్యున్నతిని, అభివృద్ధిని అడ్డుకున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు హామీలను నెరవేర్చలేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల ఊబిలో ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో దాచుకొని దోచుకున్నారని దుయ్యబట్టారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనకు తెలంగాణ ప్రజలు చమర గీతం పాడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్క మహిళ కోటేశ్వరులను చేయడమే రేవంత్ రెడ్డి సర్కార్ సంకల్పంతో పనిచేస్తుందని అన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ముందుంచి వారి అభ్యున్నతికి మరింత తోడ్పాటు అందించడానికి గ్రామీణ ప్రాంత మహిళ సంఘాల నుండి పట్టణ, నగర మహిళా సంఘాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కొత్త సంఘాలను సైతం ఏర్పాటు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి కొత్త పథకాలు తీసుకువచ్చి వారిని మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణించడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పథకాలలో మహిళల పేరుతోనే పథకాలు వారికి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టిందని అన్నారు. గత ప్రభుత్వం లో నాణ్యతలేని చీరలను పంపిణీ చేసి వ్యవసాయ క్షేత్రాలలో ప్రహరీలకు మాత్రమే పనిచేశాయని, ప్రస్తుతం మహిళా సంఘాల దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన చీరలను అందిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరిట గత 15 సంవత్సరాలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని ప్రస్తుతం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించే విధంగా చర్యలు చేపట్టి అందరికీ న్యాయం చేసిందని గుర్తు చేశారు. ఉన్నవారితో సమానంగా ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుగా నిలిచిందని గుర్తు చేశారు. కొన్ని పార్టీలు పనికట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తుందని అన్నారు. రాష్ట్రంలో గత ఇందిరమ్మ కాలంలో నిర్మించిన ఇల్లు మంజూరు తప్ప న్యాయమైన నిరుపేదలకు అందించే ఇళ్లను మంజూరు చేయకుండా డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో గత ప్రభుత్వాలు నాటకాలు ఆడి ప్రజలను నిండుగా ముంచాయని గుర్తు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టి అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లబ్ధిదారులకు అందించి వారికి గూడు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎన్నో పథకాలను తీసుకువచ్చిందని అన్నారు. మరో మూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా చేయడానికి మహిళా సంఘాలతో పాటు తెలంగాణ ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంతరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీడీవో, ఎమ్మార్వో మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు


