20న దోమకొండ సర్పంచ్ ప్రమాణ స్వీకార బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరు కావాలి…!
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ని కలసి పుష్పగుచ్చం అందజేసిన దోమకొండ సర్పంచ్ ఐరేణి నరసయ్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 16 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈనెల 20న సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేయుచున్న సందర్భంగా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని కోరుతూ మంగళవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, రాష్ట్ర నాయకులు ఇలియాస్ కి పుష్పగుచ్చం అందజేసి విన్నవించారు. దోమకొండ గడికోట వారసులు కామినేని శోభన, అనిల్ కుమార్ ,మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ప్రమాణ శ్రీకారోత్సవ కార్యక్రమానికి హాజరవుతామని ఐరేని నర్సయ్య చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, బత్తిని సిద్ధ రాములు, బుర్రి లింగం, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


