ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యాయత్నం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.

ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్యాయత్నం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.

– ట్రాక్టర్ స్వాధీనం, నిందితుడి అరెస్టు రిమాండ్ కు తరలింపు.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 16. (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న ఘటనపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి బిట్ల బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన కురుమ చిరంజీవి ట్రాక్టర్‌తో పిర్యాది మరియు అతనితోపాటు అక్కడ ఉన్న వ్యక్తులపైకి తీసుక వచ్చి హత్యాయత్నానికి ప్రయత్నించగ గంజి భారతి, బండమీద బాలమణులకు తీవ్ర గాయాలు కాగా, పద్మ సత్తవ్వ, తోట శారద, గంజి అద్విత్ లు ,పిర్యాది గాయపడ్డారు.

ఈ ఘటనపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు నం.234/2025 కింద బి.ఎన్.ఎస్ సెక్షన్లు 109, 351(రెండు) ఆర్ డబ్ల్యు మూడు(5) ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడు అగు కురుమ చిరంజీవిని సోమవారం నాడు అరెస్టు చేసి అదే రోజున రిమాండ్ కు తరలించడం జరిగింది. హత్యాయత్నానికి ఉపయోగించిన ట్రాక్టర్‌ను కూడా సీజ్ చేయడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!