ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వాహనంలో ఆసుపత్రికి తరలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్…
మానవత్వం చాటిన జిల్లా కలెక్టర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 17 (అఖండ భూమి న్యూస్);
నిజాం సాగర్ – మాగి మధ్యలో జరిగిన ఆటో, బైక్ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మానవత్వంతో స్పందించి వాహనంలో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2.00 గంటలకు వివిధ మండలాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ వెళ్తుండగా, మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద కోడ్‌పగల్‌లో ఓటు వేసి తిరిగి వస్తున్న సమయంలో ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
ప్రమాదాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి, ఎలాంటి ఆలస్యం చేయకుండా వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


