అబ్బా ఒక్కటి కాదా..? 5 పులులే..!
5 పులుల సంచారం.. అదిరిపోతున్న గ్రామీణ ప్రజలు..
పులుల జాడ తెలియక ప్రజలు, రైతులు అయోమయం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 17 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా లో పెద్దపులిల సంచారంతో ప్రజలు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, మాచారెడ్డి అటవీ ప్రాంతం, పాల్వంచ మండలం, బిబిపేట్, భిక్కనూరు మండలల్లో పులులు ఆవు, గేదెలపై దాడి చేసి చంపుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు. రైతులు ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి జంకుతున్నారు. ద్విచక్ర వాహనదారులు దూర ప్రాంతాలకు వెళ్లడానికి జంకుతున్నారు. మొత్తానికి ఒక్కటి కాదు 5 పులులు సంచరిస్తున్నాయని ఆయా గ్రామాల్లో జోరుగా ప్రచారం జరగడంతో క్షణం క్షణం భయం భయంగా మారింది. జనావాసాల్లో గ్రామాల చివరలో ఉన్న కాలనీలు సైతం పులి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందో అని తెలిసి బయటకు వెళ్లడానికే నిరాకరిస్తున్నారు. మొత్తానికి పెద్దపులిల సంచారంతో ఆయా మండలాల్లో నాయనా పులి వచ్చే కథ మేరకు పులి కనిపించిందని, ఈ ప్రాంతంలో తిరుగుతుందని, జనావాసాల వైపు వస్తుందని? జోరుగా ప్రచారం గ్రామాల్లో జరగడంతో భయాందనాలకు గురవుతున్నారు. మొత్తానికి ఒకటి కాదు 5 పులులు తిరుగుతున్నాయని జోరు ప్రచారం జరగడంతో గ్రామాల్లో క్షణక్షణం భయం భయంగా మారింది. ఫారెస్ట్ అధికారులు పెద్దపులను పట్టుకొని గ్రామాల ప్రజలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


