*10 గంటల ముందే చార్ట్ ప్రిపరేషన్: రైల్వే శాఖ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 18 (అఖండ భూమి న్యూస్);
రైలు ప్రయాణాల్లో అనిశ్చితిని తగ్గించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు తయారుచేసే రిజర్వేషన్ చార్టును ఇకపై దాదాపు 10 గంటల ముందుగానే ఖరారు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రయాణికులు తమ టికెట్ స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకుని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. కొత్త టైమింగ్స్ ప్రకారం, ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బయల్దేరే రైళ్లకు తొలి చార్టును ముందు రోజు రాత్రి 8 గంటలకల్లా, మిగిలిన రైళ్లకు కనీసం 10 గంటల ముందుగా రూపొందించాలని రైల్వే బోర్డు తెలిపింది.
You may also like
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సన్మానాలు…


