విద్యార్థులకు బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం

విద్యార్థులకు బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయం

యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు

అఖండ భూమి డిసెంబర్ 18 న్యూస్

వుల్లలచెరువు విద్యార్థులకు బంగారు భవిష్యత్తే ప్రభుత్వ ధ్యేయమని యర్రగొండపాలెం నియో జకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నా రు. పుల్లలచెరువు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపో యిన విద్యా వసతి భవనాలను గురువారం ఆయన పరి శీలించారు. పట్టణంలో నిర్మాణ దశలోనే నిలిచిపోయిన స్త్రీ శక్తి భవనం, కస్తూర్భా గాంధీ బాలికల జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వసతి గృహాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు. హాస్టళ్లలో ప్రస్తుతం ఉన్న వసతులు, మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, త్రాగు నీరు, పరిశుభ్రమైన వసతి, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రత వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా బాలికల హాస్టళ్లలో భద్రతకు అత్యంత ప్రాధా న్యం ఇవ్వాలని, అవసరమైన సిబ్బంది నియామకం వెం టనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ లో ఉన్న నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసి భవనాలను ప్రారంభించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిధుల

విడుదల, పనుల పర్యవేక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండ కూడదని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు సక్రమంగా పనిచేస్తేనే సమాజానికి మేలని, విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మరియదాసు, ఎంఈఓ

ఇందిరా ప్రసాద్, ఏపీఎం వెంకటయ్య, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ లిల్లీ ప్రకాష్ వాణి, ఆత్మనాయుడు, ఎంపీపీ వెంకటయ్య, రెంటపల్లి సుబ్బా రెడ్డి, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఉప్పల హనుమంత్, సొసైటీ డైరెక్టర్ గద్దె వెంకటేశ్వర్లు, గజ్వల్లి భాస్కర్, మం డల ఉపాధ్యక్షులు కాయకోకుల ఆదెమ్మ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!