మాజీ సీఎం, జాతీయ ఆర్చరీ కమిటీ బృందాన్ని సన్మానించిన తిరుమల్ గౌడ్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 19 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ ఆశ్చర్య అసోసియేషన్ అధ్యక్షుడు అర్జున్ ముండాతో పాటు జాతీయ, రాష్ట్ర అర్చరీ కమిటీ బృందాన్ని శుక్రవారం దోమకొండ గడికోటలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు, కామారెడ్డి జిల్లా అర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిర్మల్ గౌడ్ సన్మానించారు. హైదరాబాద్లో గురువారం జాతీయ అర్చరీ పోటీలు ముగిసిన అనంతరం దోమకొండ గడీ కోటలో సంస్థానాధీశుల వారసులు కామినేట్ అనిల్ కుమార్ ఆహ్వానం మేరకు రాత్రి వారందరూ బస చేశారు. శుక్రవారం ఉదయం వారందరూ గడి కోట సందర్శన సమయంలో తిర్మల్ గౌడ్, వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ సీఎం అర్జున్ ముండా దంపతులతో పాటు జాతీయ అర్చరీ డైరెక్టర్ ప్రీమిలేయర్ కామినేని అనిల్ కుమార్, జాతీయ అర్చరీ కమిటీ ఉపాధ్యక్షులు ఈగ సంజీవరెడ్డి, గురుం, కోశాధికారి జోరిస్ పాల్, సుమంత్ మహతి, అరవింద్, ఒలంపిక్ ఛాంపియన్ ప్లేయర్ డోలా బెనర్జీ లతోపాటు పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో దోమకొండ ఆర్చర్ అకాడమీ కోచర్ ప్రతాప్ దాస్, గడికోట ట్రస్టు సీనియర్ మేనేజర్ బాబ్జి, స్థానిక నాయకులు కుమ్మరి రాజు, నయీం తదితరులు పాల్గొన్నారు.


