*కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి…
*ఎస్ పి ఈ యాక్ట్ 1976 చట్టాన్ని పునరుద్ధరించాలి..
*సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్..
*తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ (టి ఎం ఎం ఎస్ ఆర్ యు) కామారెడ్డిశాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ (ఎస్ పి ఈ యాక్ట్ 1976) ని పునరుద్దరించాలని ఈ రోజు కామారెడ్డి కార్మిక శాఖ కార్యాలయం(కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేటు) ముందు మెడికల్ & సేల్స్ రిప్రెజెంటేటివ్స్ ధర్నా శుక్రవారం నిర్వహించారు.
4 కొత్త కార్మిక చట్టాల వలన దేశం లో ఉన్న కార్మిక వర్గానికి మరియు మెడికల్ & సేల్స్ రిప్రెజెంటేటివ్స్ తీవ్ర అన్యాయం జరుగుతుందని, యూనియన్ ఏర్పాటు చేసుకొనే హక్కు ని, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కును కూడా కాలరాసేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నారు. మెడికల్ &సేల్స్ రిప్రెజెంటేటివ్స్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (ఎస్ పి ఈ ) యాక్ట్ 1976 కూడా రద్దు చేయడంతో దేశ వ్యాప్తంగా పని చేస్తున్న మెడికల్ రిప్రెజెంటేటివ్స్ కి ఫారం ఏ లో అప్పాయింట్మెంట్ లెటర్ రాకపోవడం,కనీస వేతన చట్టం, బోనస్ చట్టం, గ్రాట్యుటీ చట్టం, ఇలాంటి ఎన్నో చట్టాలు అమలు ప్రశ్ననార్ధకంగా మారుతుందని తెలిపారు,
రాష్ట్ర ప్రభుత్వం ఈ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ (ఎస్ పి ఈ యాక్ట్ 1976) ని యాదవిధిగా అమలు పరిచేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని, అలాగే ఈ చట్టాలు తయారు చేసే సమయం లో యూనియన్ గా తామిచ్చిన సలహాలు, సూచనలు పొందుపరచాలని, అన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాలకు అనుగుణంగా రూల్స్ రూపొందిస్తే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (ఎస్ పి ఈ) యాక్ట్ 1976 చట్టం ఆధారంగా తాము గత ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని వాటిని యధావిధిగా పొందు పరచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు గడ్డం వివేక్ వెంకట స్వామికి జిల్లా కార్మిక శాఖ అధికారుల ద్వారా వినతిపత్రం సమర్పించడం జరుగుతుందని, అన్నారు.
నిన్న అనగా డిసెంబర్ 18న కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ (ఎస్ పి ఈ ) యాక్ట్ 1976 చట్టాన్ని పునరుద్దరించాలని, మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ కి చట్ట భద్ధమైన పని విధానాలను రూపొందిచాలని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెజెంటేటివ్స్ యూనియన్ (టీ ఎం ఎస్ ఆర్ యు) ఆధ్వర్యంలో వేలాది మందితో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ కుమార్, రాష్ట్ర & సబ్ యూనిట్ నాయకులు కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ రవీంద్ర చారి ,.
ఉపాధ్యక్షులు మహేంద్ర రెడ్డి.
సెక్రటేరి ప్రేమ్ కుమార్.
జాయింట్ సెక్రెటరీ సంతోష్
కోశాధికారి జన్రాజ్ 120 మంది మెడికల్ రిప్రెజెంటేటివ్స్ పాల్గొన్నారు.


