షాద్ నగర్ : మే 16 అఖండ భూమి వెబ్ న్యూస్ :
నవమాసాలు మోసి ఆపై బిడ్డను కని తమకేమీ సంబంధం లేదన్నట్లుగా చాలామంది తల్లులు వ్యవహరిస్తున్నారు. సమాజంలొ ఆడపిల్లలైతే కనడం వరకే బాధ్యత తీసుకుని ఆపై ఏ చెత్త బుట్టలోనో, ఏ ముళ్లకంపల్లోనో వదిలి వెళ్లిపోతున్నారు. ఏ మాత్రం దయ జాలి లేకుండా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలో మంగళవారం రోజున ఓ కసాయి తల్లి రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం విఠ్యాల వద్ద ఓ బుజ్జాయి పాపను వదిలి వెళ్లిపోయింది ఈ హృదయ విచారకమైన దృశ్యం చాలామందిని కదిలించింది. తల్లి వదిలి వెళ్లిపోవడంతో పాప ఆకలికి ఏడవడంతో స్థానికులు పాప ఏడుపు విని రోడ్డు పక్కన చూస్తే చిన్నారి కనబడడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు ఆ పాప కు మహిళలు అండగా నిలిచారు. అండగా నిలిచి ఎత్తుకున్నారు మహిళలు ఆ పాప కు పాలు పట్టించారు. పాప కాలిపై కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



