ఇక తెలంగాణలో పిఎసిఎస్ చైర్మన్ లు , డైరెక్టర్ ల పాలకవర్గాలు రద్దు..!

ఇక తెలంగాణలో పిఎసిఎస్ చైర్మన్ లు , డైరెక్టర్ ల పాలకవర్గాలు రద్దు..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 20 (అఖండ భూమి న్యూస్);

ఇక తెలంగాణ రాష్ట్రంలో పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం ఫిబ్రవరిలో ముగియడంతో పాలకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి పి ఏ సి ఎస్ చైర్మన్ ల, డైరెక్టర్ రా పదవీకాలం రద్దు చేసింది. వీరి పదవి కాలం ఆగస్టు 14 తేదీతో ముగిసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పి ఏ సి ఎస్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో డిసెంబర్ 19 కే తెలంగాణ రాష్ట్రంలోని 9 జిల్లాలలో డీసీసీబీలను తొలగించి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 13న జరిగిన ఎన్నికల్లో ద్వారా ఏర్పడిన ఈ పాలకవర్గాలు పదవి కాలం ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సత్తా చాటడంతో కాంగ్రెస్ పార్టీ జోస్ లో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో స్థానిక సంస్థలతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి క్యాబినెట్లో చర్చించి ఎన్నికలు నిర్వహించి మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. జనవరిలో మున్సిపల్ ఎన్నికల తో పాటు జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Akhand Bhoomi News

error: Content is protected !!