డ్వాక్రా బకాయిలపై ప్రభుత్వం ఉక్కు పాదం….
బకాయిలు కట్టకపోతే ఆస్తుల జప్తు….
శ్రీనిధి రుణబకాయులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం…
వసుళ్ల కోసం రెవిన్యూ రికవరీ చట్టం అమలుకు ఆదేశాలు….
అప్పు కట్టని వారి ఆస్తులను జప్తు చేసి, వేలం వేసే అధికారం….
సభ్యురాలు కట్టకపోతే గ్రూపులోని అందరి పైన భారం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 5.
(అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా స్త్రీ నిధి ద్వారా రుణాలు పొంది, నెలవారి వాయిదాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. పేరుకుపోయిన మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రెవిన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేస్తూ, జగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ అంశం ప్రాధాన్యత సంచరించుకుంది. రెవిన్యూ రికవరీ చట్టం ఏమిటి?.
ప్రభుత్వానికి రావలసిన బకాయిలను వసూలు చేసేందుకు ఈ చట్టాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగిస్తారు. దీని ప్రకారం రుణం చెల్లించని వారి ఆస్తులు జప్తు చేసే అధికారం ఆ శాఖల అధికారులకు లభిస్తుంది. ఇల్లు, భూముల వంటి స్థిరాస్తులతో పాటు ఇతర విలువైన వస్తువులను సహజనం చేసుకొని. వాటిని బహిరంగంగా వేలం వేసే అధికారం ఆ చట్టం ద్వారా సంక్రమిస్తుంది. ఆ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వం తన బకాయి కింద జమ చేసుకుంటుంది. ఈ చట్టం అమలుతో బకాయిదారులపై ఒత్తిడి పెంచి, వసూళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లాలో తీవ్రమైన పరిస్థితి. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 60 వేల మందికి పైగా డ్వాక్రా సభ్యులు ఉండగా, వారికి ప్రభుత్వం ఇప్పటివరకు 475 కోట్ల రుణాలను ప్రభుత్వం అందించింది. చాలామంది మహిళలు తమ వ్యాపారాల కోసం 30 వేల నుండి మూడు లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. జిల్లాలో వసులు కావలసిన 101 కోట్ల గాను కేవలం 78 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. దాదాపు 23 కోట్ల మొండి బకాయిలుగా పేర్కొనడంతో ప్రభుత్వం ఈ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక్కరు కట్టకపోయినా అందరికీ చిక్కులే. ఈ చట్టంలో అత్యంత కీలకమైన అంశం ఒకటి ఉంది. మనం తీసుకున్న సభ్యురాలు పేరుమీద ఎలాంటి ఆస్తులు లేకపోతే, ఆ అప్పును తీర్చే బాధ్యత సంఘంలోని మిగిలిన సభ్యులపై పడుతుందని ఈ చట్టం చెబుతోంది. అంటే ఒకరు చేసిన పొరపాటుకు సంఘంలోని అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. అవసరమైతే ఇతర సభ్యుల ఆస్త్రం కూడా జప్తు చేసేందుకు ఈ చట్టం వీళ్ళు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో సంఘంలోని మహిళలు పరస్పర సహకారంతో సకాలంలో రుణాలు చెల్లించేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే సర్ఫ్, మెప్మా అధికారులు గ్రామాలలో పర్యటించి, బకాయిల చెల్లింపు పై సంగం సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు డిఆర్డిఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల నుండి అనుమతులు రావడంతో త్వరలోనే జప్తు ప్రక్రియ ప్రారంభం కానునట్లు సమాచారం….


