సీఎం సహాయనిధి పేదలకు వరం :ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 

సీఎం సహాయనిధి పేదలకు వరం :ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి

 

ఆత్మకూర్, శ్రీశైలం అఖండ భూమి న్యూస్ జనవరి,8

ఆత్మకూరు పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఒక వరం అని శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వివిధ మండలాలకు చెందిన 79, మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 38 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి ఒక్కరికి సాయం మంజూరు అవుతుందని అన్నారు. గతంలోనూ రికార్డు స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ ను ప్రజలకు అందించామని.. ఇప్పుడు కూడా నెలలో రెండు పర్యాయాలు పేద ప్రజల వైద్య చికిత్సలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంలో లక్షలలో సహాయం అందిస్తున్నామన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!