బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై రాజీ కుదిరిందని, దాదాపు నాలుగు రోజుల నుంచి ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరపడిందని వార్తలు వస్తున్న సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు..
గురువారం సాయంత్రం 7 గంటలకు క్వీన్స్ రోడ్‌లోని ఇందిరా గాంధీ భవన్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా హాజరు కావాలని కోరారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని, డీకే శివ కుమార్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. వీరు ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొదటి రెండేళ్లు ముఖ్యమంత్రి పదవిని సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు ఆ పదవిని డీకే శివ కుమార్ నిర్వహిస్తారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు..
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…