విశాఖలో చంద్రబాబు కు అపూర్వ ఘన స్వాగతం…  భారీగా తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు..

 

విశాఖలో చంద్రబాబు కు అపూర్వ ఘన స్వాగతం…

భారీగా తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు..

విశాఖపట్నం అఖండ భూమి వెబ్ న్యూస్ :

విశాఖలోని మూడు రోజులు పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు భారీగా తరలివచ్చి అపూర్వ ఘన స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గణబాబు పల్లా శ్రీనివాసరావు పాటు తెదేపా నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలికి పెందుర్తికు తరలి వెళ్లారు. మార్గం మధ్యలో గణబాబు నివాసం వద్ద చంద్రబాబు ఆగి గణబాబు కుమారుడు మౌర్య సింహను శుభాకాంక్షలు తెలిపారు. దారి పొడవునా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుకు సాగారు. పెందుర్తి కోడేలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో జన సముద్రం కనిపించింది. రాత్రికి సమీపంలో గల చీమలపల్లి లోని కళ్యాణ మండపం వద్ద చంద్రబాబు బస ఏర్పాటు చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!