గణతంత్ర దినోత్సవం పండుగ రోజున కూడా జెండా ఎగరవేయకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్న అగ్రికల్చర్ అధికారులు*

దేశభక్తి, జాతీయ గౌరవం పట్ల అధికారుల వైఖరి
పుల్లలచెరువు అఖండ భూమి జనవరి 26 న్యూస్
పుల్లల చెరువు మండల కేంద్రలో అగ్రికల్చర్ కార్యాలయంలో జాతీయ ಜಂಡ್ ఎగురవేయకుండా కార్యాలయం అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తూ వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. . గణతంత్ర దినోత్సవం పండుగ రోజున ప్రభుత్వ కార్యాలయంలో త్రివర్ణ పతాకం ఎగురవేయకపోవడం ద్వారా దేశభక్తి, జాతీయ గౌరవం పట్ల అధికారుల వైఖరి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటన స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వ ఆదేశాలు, నిబందనలు స్పష్టంగా ఉన్నప్పటికి, రైతులకు సేవలందించాల్సిన అగ్రికల్చర్ శాఖ కార్యాలయంలోనే ఈ విధమైన అవమానం చోటు చేసుకోవడం ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది జాతీయ బాధ్యతను తృణప్రాయంగా భావించిన దారుణ ఉదాహరణ అని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రాధమిక కర్తవ్యమని రాజ్యాంగమే చెబుతున్నా, అగ్రికల్చర్ కార్యాలయ అధికారులు మాత్రం ఆ కర్తవ్యాన్ని కాలరాశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల సమస్యల పరిష్కారంలో ముందుండాల్సిన అధికారులు, కనీసంగా జెండా ఎగురవేయడం వంటి బాధ్యతను కూడా నిర్వర్తించకపోవడం పరమ దురదృష్టకరమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యంపై తక్షణమే శాఖాపరమైన విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించే ఇలాంటి ఘటనలు కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం సడలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి బాధ్యులపై ఉదాహరణాత్మక చర్యలు తీసుకోవాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


