28 నుండి మున్సిపాల్, కార్పొరేషన్ లకు నామినేషన్ల దాకలకు సర్వం సిద్ధం…
ఒకటో విడతలోనే పోలింగ్..
రేపటినుండి నామినేషన్ల స్వీకరణ..
ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు..
ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 27 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మంగళవారం విడుదల చేసింది. జనవరి 28 నుండి 30వ తేదీ వరకు నామినేషన్లు వేయడం, 31న పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ, 11న ఎన్నికలు, 12న రీపోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 16న ప్రమాణస్వీకారం తో ఎన్నికలు ముగుస్తాయి. ఈ ఎన్నికలలో ప్రధాన పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉంటారు. అధికార పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు ఇన్చార్జిలో నియమించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేందుకు గెలుపు గుర్రాలను బారిలో ఉంచేందుకు సిద్ధమైనారు. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాకుండా పట్టణ, నగర ప్రాంతాల్లో బిజెపి సైతం బలంగా ఉండడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


