రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ ఆద్వర్యం లో పూర్తి…

రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ ఆద్వర్యం లో పూర్తి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 02 (అకాండ భూమి న్యూస్);

2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం కామారెడ్డి జిల్లాలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.

ఈ కార్యక్రమం సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్, అదనపు కలెక్టర్/అదనపు ఎన్నికల అధికారి మధుమోహన్, అదనపు కలెక్టర్ విక్టర్ల పర్యవేక్షణలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించడం జరిగింది.

కామారెడ్డి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో గల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ప్రిసైడింగ్ అధికారులు (పిఓలు),

సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవోలు),

ఇతర పోలింగ్ అధికారులు (OPOలు)లను ర్యాండమైజేషన్ విధానం ద్వారా కేటాయించారు.

పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సాధారణ పరిశీలకులు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 4వ తేదీన నాలుగు మున్సిపాలిటీలలో నిర్వహించబడతాయని, అలాగే పోలింగ్ సామగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) ప్రక్రియ 10వ తేదీన ఉదయం 7.00 గంటల నుండి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

శిక్షణ & డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు.

*బాన్సువాడ* : మున్సిపల్ కార్యాలయం – శిక్షణ

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఎస్ ఆర్ ఎన్ కె డిగ్రీ కళాశాల దేశాయిపేట.

*కామారెడ్డి* ప్రభుత్వ డిగ్రీ కళాశాల – శిక్షణ

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం – AMC గోడౌన్ (ఎస్పీ కార్యాలయం సమీపంలో)

*బిచ్కుంద* : ప్రభుత్వ డిగ్రీ కళాశాల – శిక్షణ

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం – వ్యవసాయ మార్కెట్ యార్డ్

*ఎల్లారెడ్డి :* ఎంపిడిఓ కార్యాలయం – శిక్షణ

డిస్ట్రిబ్యూషన్ కేంద్రం – ప్రభుత్వ డిగ్రీ కళాశాల

ఈ ఎన్నికల నిర్వహణకు

పిడిలు : 239

ఏపీఓలు : 239

ఓ పి ఓ లు : 645

మొత్తం 1195 మంది పోలింగ్ సిబ్బంది, అదనంగా 1398 మంది రిజర్వ్ సిబ్బంది లను నియమించినట్లు సాధారణ పరిశీలకులు తెలిపారు.

ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో రఘునందన్ (సిపిఓ), శివకుమార్ (ఎస్ ఓ), కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!