దోమకొండలో అంబరాన్ని అంటిన ఊర పండగ సంబరాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గత నెల 30న ప్రారంభమైన దోమకొండ ఊర పండగ సంబరాలు సోమవారంతో మూడో రోజుకు చేరుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఊర పండగను భక్తిశ్రద్ధలతో ఐద రోజుల పండగ ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈనెల 30న ప్రారంభమైన ఉత్సవాలు ,సార్గమ్మ విగ్రహ ప్రతిష్ట, గ్రామంలో ని ఊరడమ్మ వద్ద డప్పు వాయిద్యాలతో, శివసత్తుల నాట్యం నృత్యములతో, మహిళల బోనాలతో, పోతరాజుల విన్యాసాలతో, బైండ్ల వారి విన్యాసాలతో, రంగసాని తో రంగమెక్కించి భవిష్యవాణి వినిపించడం అందర్నీ ఆకట్టుకున్నాయి. గ్రామంలోని భక్తులే కాకుండా వేలాది మంది భక్తులు ఇతర గ్రామాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కట్ట మైసమ్మకు మంగళవారం పండగ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఐదు రోజుల పండగను గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య పర్యవేక్షణలో కుల సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


