శ్రీ కాళహస్తి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ

శ్రీ కాళహస్తి దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ

 

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ ఫిబ్రవరి 8

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.

శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ సాయిప్రసాద్, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం ప్రధానార్చకులు కరుణాకర్ గురుకుల్, సహాయ కార్యనిర్వహణాధికారి ఐ.ఎన్.వి. మోహన్, పర్యవేక్షకులు నాగభూషణం, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, అధికారులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.

అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు మరియు వైదిక సిబ్బంది మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేయడం జరిగింది.

Akhand Bhoomi News

error: Content is protected !!