జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్–2025 (2వ ఎడిషన్) ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 12 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా స్థాయిజిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్–2025 (2వ ఎడిషన్) ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ … చీఫ్ మినిస్టర్స్ కప్–2025 టోర్నమెంట్ల 2వ ఎడిషన్ గురువారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , అదనపు కలెక్టర్ విక్టర్ లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చీఫ్ మినిస్టర్స్ కప్ వంటి పోటీలు గ్రామీణ పట్టణ ప్రాంతాల యువతకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి, జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.
అదనపు కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడా విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు..
ఈ సందర్భంగా ఈ క్రీడా పోటీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ మొదటగా కబడ్డీ ఆడుతూ పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో క్రీడా అధికారులు వెంకటేశ్వర్లు గౌడ్, rdo వీణ, తహసిల్దార్ జనార్ధన్, pd మెప్మ , కోచ్,లు, క్రీడాకారులు , తదితరులు పాల్గొన్నారు.
You may also like
2026 ఆర్థిక అక్షరాస్యత దినోత్సవం ర్యాలీ…
మార్చిలో జిల్లా , మండల పరిషత్ ఎన్నికలు..!
సీఎం కప్ కామారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఫైనల్ విన్నర్ మాన్యశ్రీ*
*కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.*
మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర …


