సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ హాజరు లేకుంటే తగు చర్యలు.
జిల్లా కలెక్టర్ డాక్టర్. వి వినోద్ కుమార్.
(రేపల్లె నియోజకవర్గ ఇంచార్జి: సిహెచ్ రాంబాబు. చెరుకుపల్లి, ఫిబ్రవరి 12, అఖండ భూమి న్యూస్) సచివాలయ సిబ్బంది రోజువారి బయోమెట్రిక్ హాజరు సమయానుకూలంగా లేకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి .వినోద్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ఆరంబాక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన సిబ్బంది బయోమెట్రిక్ హాజరు సరిగా లేకపోవడాన్ని గుర్తించి సిబ్బందిని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్దేశిత సమయానికి సిబ్బంది బయోమెట్రిక్ హాజరు విధిగా నమోదు కావాలని అలా సమయానికి నమోదు కాని పక్షంలో శాఖపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అదేవిధంగా రేషన్ పంపిణీ, ప్రజా సానుకూలత, రెవెన్యూ సేవలు, రీ సర్వే ,మ్యుటేషన్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించడంలో పారదర్శకంగా ఉండాలని సేవలో ఆలస్యం చోటు చేసుకుంటే తక్షణమే దరఖాస్తుదారులు అధికారులు దృష్టికి తీసుకురావాలని ఆయన స్థానికులకు సూచన చేశారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, తాసిల్దార్ సిహెచ్ పద్మావతి, పంచాయతీ కార్యదర్శి పులి నాగ మల్లేశ్వరి, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.
You may also like
చెత్త నుండి సంపద సృష్టి — పరిశుభ్రమైన యర్రగొండపాలెం కోసం గూడూరి ఎరిక్షన్ బాబు
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …



