నలుగురు గొర్రెల నిందితులను అరెస్ట్ : సీఐ.కె.శ్రీనివాస రావు
బెల్లంపల్లి జులై 23(అఖండ భూమి న్యూస్):బెల్లంపల్లి 1 టౌన్ పరిధిలో గొర్రె దొంగతనం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే..బుడిదగడ్డ బస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్లా వయసు (35)ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు అతనికి 4 గొర్రెలు 10 మేకలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అబ్దుల్లా తండ్రి జానీ గొర్రెలను,మేకలను మేతకు తీసుకువెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి తీసుకొచ్చేవారు.20 నాడు స్థానిక సింగరేణి ఫంక్షన్ హాల్ దగ్గర మేతకు తీసుకెళ్లగా, సాయంత్రం ఒక ఆడ గొర్రె కనిపించలేదు చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి ఉంటారని అనుమానించి 21న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.దొంగతనం చేసిన గొర్రె విలువ సుమారు రూ.10,000 రూపాయలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.ఈ కేసులో దొంగలించబడ్డ గొర్రెను అలాగే దొంగతనానికి ఉపయోగించిన మూడు ఆటోలను పోలీసు వారు రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.
అరెస్ట్ అయిన నిందితుల వివరాలు:
1మంచర్ల రమేష్ తండ్రి దుగ్రయ్య
వయసు(55 )సంవత్సరాలు,ఆటో డ్రైవర్,నివాసం చంద్రవెల్లి,బెల్లంపల్లి
2.కొట్ల వినోద్ కుమార్,తండ్రి లింగయ్య
వయసు(30)సంవత్సరాలు,ఆటో డ్రైవర్,నివాసం చాకేపల్లి,బెల్లంపల్లి 3.తిరుపతి గుజ్జ,తండ్రి బాలయ్య(50) సంవత్సరాలు,ఆటో డ్రైవర్,నివాసం
చంద్రవెల్లి,బెల్లంపల్లి. 4.ఎడిగిరాల శంకర్,తండ్రి వెంకటి,
(40 )సంవత్సరాలు,ఆటో డ్రైవర్, నివాసం మాలాగురిజాల,వీరిని పట్టుకున్నట్టుగా తెలిపారు.అలాగే ప్రజల ఆస్తిని దొంగిలించే వారిని ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని, చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ హెచ్ ఓ,కే. శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు…
You may also like
కామారెడ్డిలో వేక్నో డెంటల్ ఆసుపత్రి ప్రారంభం…
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి…
వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించిన జిల్లా ఎస్పీ
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం…
మన యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు…



