బెల్లంపల్లి పాతికేళ్ల కల నెరవేరేన ప్రజల చిరకాల కోరిక తీరేనా
*మంత్రి,ఎంపీ,ఎమ్మెల్యేలుప్రత్యేక చొరవ చూపుతారా! బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాల గా అప్గ్రేడ్ చేస్తారా*
అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య(ఏఐఎఫ్డీఎస్)రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్
బెల్లంపల్లి ఫిబ్రవరి 26(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య
(ఎఐఎఫ్డిఎస్)ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థుల,యువకుల పోరాట ఫలితంగా అప్పటి ప్రభుత్వం 1993 సంవత్సరంలో బెల్లంపల్లి కేంద్రంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిందని,బెల్లంపల్లి సింగరేణి ప్రాంతం కావున ఈ కళాశాలలో మైనింగ్,ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ మరియు ఇతర కోర్సులను అందుబాటులో ఉంచిందని,ప్రతి సంవత్సరం వందలాదిమంది విద్యార్థులు ఈ కోర్సులను అభ్యసిస్తున్నారని,ఉత్తీర్ణులవుతున్నారని,మారుతున్న కాలంతో పాటు భవిష్యత్తు అవసరాలకు అనుకూలంగా సాంకేతిక విద్యను మేలవించి కొత్తగా 2026-27 సంవత్సరానికి గాను ఆటోమేషన్ అండ్ రోబోటిక్ కోర్సును విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా 6 కోట్ల రూపాయలతో అధునాతనమైన ల్యాబ్ సౌకర్యంతో నూతన కోర్సును మన బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశపెట్టబోతున్నారని,ఇది చాలా సంతోషకరమైన విషయమని,నూతన కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు ఈ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని ఇక్కడి ప్రజలు, విద్యార్థులు కోరుకుంటున్నారని, రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేస్తామని కల్లబొల్లి మాటలుచెబుతూ ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తున్నారని,నాటినుండి నేటి వరకు పాలిటెక్నిక్ కళాశాలగానే మిగిలిందని,ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని అప్గ్రేడ్ చేయించలేదని, దీనివల్ల విద్యార్థులు కరీంనగర్, వరంగల్,హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్తోమత లేక సాంకేతికవిద్యకు(ఇంజనీరింగ్) దూరమవుతున్నారని,గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది కళాశాలలను ఇంజనీర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడం జరిగిందని,అందులో బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల పేరు లేకపోవడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా ఎమ్మెల్యే,ఎంపి,మంత్రి గార్లు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ చేసి విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటును అందిస్తూ,వారికి సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు…
You may also like
ప్లాస్టిక్ నివారించడమే భవిష్యత్ తరాలు సైతం ముందుండాలి…
దోమకొండ నూతన జిపి పాలకవర్గాన్ని సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి…
బి టి ఎస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ….
ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్
దోమకొండలో ప్రధాన డ్రైనేజీ లో పనులను ప్రారంభించిన సర్పంచ్…



