కామారెడ్డిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల కు నివాళులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చ్ 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా మున్సిపల్ ముందున్న అంబేద్కర్ విగ్రహం ముందు మాదిగ అమరవీరులకు ఆదివారం నివాళులు అర్పించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 1994 ప్రారంభించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లో అమలువీరులైన మాదిగ జాతి బిడ్డలకు మార్చి 1న అమరుల దినోత్సవం గా మందకృష్ణ మాదిగ ప్రకటించి సంగతి తెలిసిందే మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మున్సిపల్ దగ్గర అమరులఅ దినోత్సవం ఘనంగా జరిపారు. వారి మరణాల పట్ల దీగబ్బందు వ్యక్తం చేస్తూ వారి ఆశయాలు కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ రాములు కొనియాడారు. వారి త్యాగాలు మరువలేనిది అని మాదిగలకు మాదిగ బిడ్డలకు పునర్జన్మ లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి, బట్టల వెంకట్ రాములు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కొత్తల. యాదగిరి, ధ్యామని భూపతి ,కొత్తూరు. సాయిలు, శైలజ, రేణుక, వాసు తదితరులు పాల్గొన్నారు.


