జెడ్పి డిప్యూటీ సీఈఓకు పదవీ విరమణ సన్మానం …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 1 (అఖండ భూమి న్యూస్);
నిజామాబాద్ జిల్లా పరిషత్ డిప్యూటీ సిఈఓగా పనిచేసిన కే రాజ్ వీర్ కు ఆదివారం దోమకొండ సర్పంచ్ ఐరేణి నర్సయ్య, మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ పదవీ విరమణ సన్మానం చేశారు. డిచ్ పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహించి, గత నాలుగు రోజుల క్రితం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గా పదోన్నతి పొందారు. వీడీవోగా ఉద్యోగంలో చేరి, అంచెలంచెలుగా జెడ్పి డిప్యూటీ సీఈఓ వరకు సేవలందించారని వారన్నారు. ప్రభుత్వ పథకాలు అమలు, ప్రజా సేవలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. గ్రామం నుండి జిల్లా స్థాయి అధికారిగా ఎదగడం గ్రామానికే గర్వకారణం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మర్రి శేఖర్, అబ్రబోయిన రాజేందర్, నేతుల సుధాకర్, పిన్నెం రామచంద్రం, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


