పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 1 (అఖండ భూమి న్యూస్);
పేదలకు అండగా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలను అందిస్తుందని దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్. , జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి లు అన్నారు. మండలంలోని చింతమాను పల్లి గ్రామంలో నీల లక్ష్మీ -నవీన్ కు చెందిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన ఉంటుందన్నారు. ఇల్లు లేని నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆదేశానుసారం తాము ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట సర్పంచ్ అక్షర శ్రీనివాస్ ,డైరెక్టర్ గోపాల్ రెడ్డి, సీతారాo మధు. శంకర్ రెడ్డి, సంజీవరెడ్డి,శేఖర్, లావణ్య, బాలమణి, అబ్రా బోయిన రాజేందర్, షమ్మీ బాల్ నర్సు సాల్రా రాజు.తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడైన నీల లక్ష్మీ నవీన్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు బట్టలు పెట్టి గౌరవించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


