మార్కాపురం జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గా రెవరెండ్ డాక్టర్ నందిగo ఫ్రాంక్లిన్ ఎఫ్రాయిము ఏకగ్రీవ ఎన్నిక

మార్కాపురం అఖండ భూమి.
మార్కాపురం డిస్ట్రిక్ట్ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంత్లీ మీటింగ్ బాప్టిస్ట్ నగర్ చర్చి నందు రెవరెండ్ డాక్టర్ పులుకూరి ఆండ్రూస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ మంత్లీ మీటింగ్ లో మార్కాపురం జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ అసోసియేషన్ మీటింగ్ లో జిల్లా అధ్యక్షులు గా నందిగం ఫ్రాంక్లిన్, గౌరవ అధ్యక్షులుగా బిషప్ డాక్టర్ మంచా ఏలీయా ,ఉపాధ్యక్షులు గా రెవరెండ్ పి ఎపప్రా గారు, సెక్రటరీ గా రెవరెండ్ డాక్టర్ పులుకూరి ఆండ్రూస్ , మార్కాపురం జిల్లా లోని నాలుగు నియోజక వర్గముల నుంచి 30 మంది సంఘ కాపరులను జిల్లా కార్యవర్గ సభ్యులగా ఎన్నుకోవటం జరిగింది. మార్కాపురం జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ నందిగం ఫ్రాంక్లిన్ గారు మాట్లాడుతూ దేవుని సేవకులు ఐక్యత కలిగి జీవిస్తూ, దేవుని ప్రేమ ను ఇతరులకు పంచుతూ, దేవుని పనిలో నమ్మకస్తులుగా కొనసాగుతు దేశ క్షేమము కొరకు ప్రార్ధన చేయువారిగా ఉండాలని దైవసందేశం ఇవ్వటం జరిగింది.ఈ మీటింగ్ కి మార్కాపురము జిల్లా 4 నియోజకవర్గముల నుంచి సుమారుగా 250 మంది పాస్టర్స్ హాజరు కావటం జరిగింది.
You may also like
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్
కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు – ప్రజాప్రతినిధుల చొరవతో రామళ్లకోట వంక శుభ్రత
విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు దీపం”
శివోహం టెంపుల్ ట్రస్ట్ అన్నదాన ప్రసాద,వితరణ,కార్యక్రమం


