జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు…
– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 28. (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (మార్చి 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపినారు.
అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


