స్వార్థం వీడి ప్రజా సేవ చేయాలి …

స్వార్థం వీడి ప్రజా సేవ చేయాలి …

ఎల్లవేళల అందుబాటులో ఉంటాం ..

పట్టణాల సమస్యల పరిష్కారం ప్రాధాన్యం ..

కామారెడ్డి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మేయర్,

చైర్ పర్సన్,కౌన్సిలర్ల కు ఘన సన్మానము

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 1 (అఖండ భూమి న్యూస్);

ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాక స్వార్థం వీడి ప్రజా సేవ చేయాలనీ ప్రజలకు సేవ చేయడంలోనే సంతోషం ఉందని నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి కరాటే రమేష్ ముదిరాజ్ అన్నారు. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి రమేష్, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, నిజామాబాద్ కార్పొరేటర్, కామారెడ్డి ఏడుగురు కౌన్సిలర్లు, బాన్సువాడ, ఎల్లారెడ్డి కౌన్సిలర్లకు ఆదివారం నాడు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. సన్మాన సభలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి మాట్లాడుతూ ప్రజలకు పట్టణవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేయడంలో సంతోషం ఉందన్నారు. నిజామాబాద్ కామారెడ్డి పట్టణాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామన్నారు. సమాజ సేవ చేసే వారికి ఓటమి ఉండదన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సేవ చేయడంతో మేయర్ పీఠం ముదిరాజ్ బిడ్డగా అవకాశం వచ్చిందని నిజామాబాద్ మేయర్ ఉమారాణి కరాటే రమేష్ అన్నారు. సేవ చేయడం ఆపదలో ఉన్న వారిని ఆదుకునే అవకాశం ప్రజాప్రతినిధులుగా తమకు వస్తుందని, కాంగ్రెస్ పార్టీ అండతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ షబ్బీర్ అలీ సహకారంతో మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులు వచ్చయన్నారు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామన్నారు. ముదిరాజులను బీసీ డీ నుండి ఏ గ్రూపు ఏ గ్రూపులోకి మార్చాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య గృహిణి అయిన తనకు కీలకమైన ముఖ్యమైన నిజామాబాద్ మేయర్ పదవి దొరకడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామన్నారు. స్వార్థం లేకుండా సేవలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్యులకు గృహిణులకు కీలక పదవులు దొరకడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనీ నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహిస్తానన్నారు. నిజామాబాద్ మేయర్ పేరు తన పేరు ఉమారాణి కావడం, ఇద్దరం నిజామాబాద్ కు కామారెడ్డికి ప్రథమ పౌరురాలు కావడం యాదృచ్ఛిక మన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ చైర్ పర్సన్ పదవులు పొందడం సంతోషమని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి అన్నారు. కామారెడ్డి పట్టణాన్ని కులమతాలకతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు. విద్యతో జాతి అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షులు మహేష్ గౌడ్ అడ్వైజర్ షబ్బీర్ ల సహకారంతో తమకు పదవులు కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు. ముదిరాజులలో సంఘటితం, ఐక్యత కావాల్సిన అవసరం ఉందన్నారు. అత్యధిక ముదిరాజులు పేదలన్నారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామన్నారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి రమేష్, నిజామాబాద్ కార్పొరేటర్ మటము పవన్, కామారెడ్డి ఏడుగురు కౌన్సిలర్లు పిట్ల వేణుగోపాల్, గేరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, కాళ్ల రాజమణి గణేష్, దాకి అరవింద్, సునుగురి భాను ప్రకాశ్, బాన్సువాడ కౌన్సిలర్ లింగమేశ్వర్, ఎల్లారెడ్డి కౌన్సిలర్ దుంపల మంజుల శంకర్ లకు కామారెడ్డి పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. మూడు ముదిరాజ్ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముదిరాజ్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, నీలకంఠం జిల్లా అధ్యక్షులు భూపాల్ విజయానంద్, బట్టు విట్టల్, పట్టణ అధ్యక్షులు కాళ్ల గంగారాజు, ప్రధాన కార్యదర్శి దుబ్బాక ప్రసాద్, ముదిరాజ్ సంఘ నాయకులు పిల్లి మల్లేష్, చింతల రమేష్, గోలివాడ శంకర్, గోలివాడ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!