*జాతీయ ఎస్సీ కమిషన్‌కు వార్డు సభ్యురాలు ఫిర్యాదు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 01 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో ఎన్నికైన మహిళా వార్డు సభ్యురాలు డి. ప్రత్యూషపై బెదిరింపులు, అవమానకర అసభ్యకరమైన మాటల ప్రవర్తన జరిగిందన్న ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
గత నెల 23న సాయంత్రం గ్రామ పరిధిలో జరిగిన ఘటనలో సర్పంచ్ తన అనుచరులు వార్డు సభ్యురాలు అయిన తనపై దురుసుగా, అసభ్యమైన పదజాలము బూతులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ దూషించారని వార్డు సభ్యురాలు ప్రత్యూష . ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత గౌరవం దెబ్బతిందని, ఎన్నికైన ప్రజా ప్రతినిధిగా విధులు నిర్వర్తించడంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆమె తెలిపారు.
ఈ విషయమై కామారెడ్డి జిల్లా ఎస్పీ కి లిఖిత పూర్వక ఫిర్యాదు సమర్పించినట్లు తెలిపారు. తనను ఓర్వలేక ఇలా మానసికంగా ఇబ్బందికి గురి చేశారని ప్రజా ప్రతినిధిగా తనకు రాజ్యాంగ పరిరక్షణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ (ఎన్ సి ఎస్ సి) ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు నమోదు కాగా, సంబంధిత అధికారుల నుండి నివేదికలు కోరే అవకాశముందని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు స్పందించి పారదర్శక విచారణ చేపట్టాలని పేర్కొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


