కామారెడ్డి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.. ! 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 1 (అఖండ భూమి న్యూస్);
జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. జిల్లాలో సెలవు రోజుల్లో టోకెన్ ఒకటి, రవాణా 21 రవాణా జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఆదివారం సెలవులు వస్తే అక్రమార్కులకు అడ్డు అదుపే ఉండదు. ఇసుక అయినా, మట్టి, అయినా, మొరం అయినా, నిర్మాణాలు చేపట్టిన, అక్రమార్కులకు వీకెండ్ పండగ వాతావరణం జిల్లా నెలకొంది. అధికారులు సెలవులలో కావడంతో వివరణ కోసం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఫిర్యాదుదారుల గోప్య బహిర్గతం చేయడం, పరపాటుగా మారింది, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాలను సైతం క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు స్మగ్లర్లకు మాఫియాకు ఇష్ట రాజ్యాంగ మారింది. కామారెడ్డి జిల్లాలో అధికారికంగా ఒక టోకెన్ ఇస్తే దానిపై..? ఇష్ట రాజ్యాంగం చేరవేస్తున్నారు క్షేత్రస్థాయిలో లీకు వీరులు ఉండడం తో, అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేయాలి అంటే జంకుతున్నారు. అధికారులను వివరణ కోరడానికి ఫోన్ చేయగా అలాంటి ఘటనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని ఎంతటివారినైనా వదిలిపెట్టబోమంటూ, కేసు నమోదు చేసి బండి సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


