జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలోనీ ఎస్సీ రిజర్వేషన్ వార్డు సభ్యురాలు డి. ప్రత్యూషపై జరిగిన బెదిరింపుల, అసభ్య పదజాలం ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కు అధికారిక నోటీసులు జారీ చేస్తూ 15 రోజుల్లో పూర్తి స్థాయి చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఫైల్ నం. ఏపీ సి ఆర్/ఓఎల్/టీజీ/2026/325436 ప్రకారం, ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ఎఫ్ ఐ ఆర్
నమోదు జరిగిందా?
ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు?
ఎస్సీ / ఎస్టి (ప్రెవేంటేషన్ ఆఫ్ అట్రాక్టీస్) యాక్ట్ వర్తింపజేశారా?
అరెస్టులు జరిగాయా?
బాధితురాలికి చట్టపరమైన రక్షణ కల్పించారా?
నష్టపరిహారం చెల్లించారా?
అన్న వివరాలను స్పష్టంగా నివేదించాలని ఆదేశించింది.
స్పందించకపోతే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్ సివిల్ కోర్ట్ అధికారాలను వినియోగించి సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు నోటీసులో స్పష్టం చేసింది.
గ్రామస్థాయి ప్రజాప్రతినిధిపై బెదిరింపులు, అసభ్య పదజాలం సామాజిక అవమానాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా యంత్రాంగం ఈ వ్యవహారాన్ని అత్యంత కఠినంగా తీసుకొని చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


