శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి..
.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);
బాన్సువాడ లో ఇటీవల జరిగిన సంఘటనలో అక్రమంగా కేసులకు గురై జైలు పాలైన అమాయకుల కుటుంబ సభ్యులను *కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ కుమార్ కామారెడ్డిలో స్వయంగా కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబాల పరిస్థితిని తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. “మీకు మేము ఉన్నాం… ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలి” అంటూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ *బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పేరుతో ఇకపై పేదల ఇండ్లు మీరు కూలిస్తే…*
*అదే ప్రాంతంలోని పెద్దల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చి వేస్తాం*
*శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి*
*ఒవైసీ అక్రమంగా నిర్మించిన ఫాతిమా కాలేజీ కూల్చడానికి పరీక్షలు అడ్డు వస్తే….*
*ఖమ్మంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్తు గుర్తుకురాలేదా?*
*పేదలకు ఒక న్యాయం… ఒవైసీ కాలేజీకి మరో న్యాయమా?*
*ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే బాన్సువాడలో హిందువులను జైల్లో వేస్తారా?*
*హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ అమాయకులను వేధిస్తున్నారా?*
*హిందువులారా… ఇంకెన్నాళ్లు కాంగ్రెస్, మజ్లిస్ అరాచకాలను భరిద్దాం?*
*హిందువులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం రండి*
*బీజేపీ కార్యకర్తల ఓపికను చేతగానితనంగా భావిస్తే గుణపాఠం తప్పదు*
*రాహుల్ గాంధీ… శిక్షణా తరగతులకు కాదు…బాధిత ప్రాంతాల్లో పర్యటించండి*
*రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చేది మూటల కోసమే*
*మూసీ పరిధిలో పేదల ఇండ్లను కూల్చి పెద్దలతో బేరాలాడుతున్నారు*
*గాంధీ విగ్రహం పేరుతో పేదల ఇండ్లను కూల్చడం దుర్మార్గం*
*గాంధీ ఆత్మ క్షోభిస్తోంది*
*గుజరాత్ లో సర్దార్ పటేల్ విగ్రహం నిర్మించి మోదీ ప్రభుత్వం ప్రజల మనసులను దోచుకుంది*
*రాష్ట్రంలో గాంధీ విగ్రహం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఉసురు తీస్తోంది*
*అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల ఏ దేశంతో యుద్దం వస్తుందో రాహుల్ సమాధానం చెప్పాలి*
*కాంగ్రెస్ లోనే అంతర్యుద్దం మొదలైన సంగతి రాహుల్ గుర్తుంచుకోవాలి*
*కాంగ్రెస్ తో జరిగిన యుద్దంలో ప్రజలు దేశవ్యాప్తంగా ఆ పార్టీని బొంద పెట్టారు*
*మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్ ను పరిమితం చేశారు*
*బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు బయట కూడా తిరగలేరు*
*కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్*
*బాన్సువాడ బాధిత కుటుంబాలను పరామర్శించిన బండి సంజయ్*
‘‘మీరు బఫర్ జోన్లు, ఎఫ్ టీఎల్ పేరుతో ఇకపై పేదల ఇండ్లను కూల్చాలనుకుంటే… అదే ప్లేస్ లో కట్టిన పెద్దల ఇండ్లను, కాంగ్రెస్ నేతల ఇండ్లను కూల్చేసేందుకు బీజేపీ కార్యకర్తలు బుల్డోజర్లతో వస్తారు. తాడోపేడో తేల్చుకుంటారు. ఒకవేళ శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘‘పరీక్షలున్నాయనే సాకుతో చెరువును ఆక్రమించి ఒవైసీ కుటుంబం నిర్మించిన ఫాతిమా కాలేజీని టచ్ కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఖమ్మంలో ఇండ్లను నిర్మించుకుని బతుకుతున్న కుటుంబాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు బతిమిలాడినా వినకుండా వాటిని ఎందుకు కూల్చివేశారు? ఫాతిమా కాలేజీకి ఒక న్యాయం? పేదలకు మరో న్యాయమా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా హిందువులపై, హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయిస్తూ అరాచకాలకు పాల్పడుతోందన్నారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందన్నారు. ‘‘హిందువులారా…ఇంకెన్నాళ్లు కాంగ్రెస్ అరాచకాలను భరిద్దాం? ఇంకెన్నాళ్లు బిచ్చపు బతుకులు బతుకుదాం. రాజకీయాలను, పార్టీలను పక్కనపెట్టి కాషాయ జెండా పట్టి ఏకమై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కండి’’అని పిలుపునిచ్చారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ ఒక హిందువుగా మాట్లాడుతున్నానని చెప్పారు.
మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే….
ఇయాళ రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల పేరుతో హైదరాబాద్ కు వచ్చారు. వాస్తవానికి అదే శిక్షణా తరగతుల వేదికపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘రాహుల్ గాంధీకి రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి ఇస్తాం’’అని అన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి ఆ మూటల కోసమా? లేక శిక్షణా తరగతుల కోసమా? స్పష్టం చేయాలి.
రాహుల్ గాంధీని కోరుతున్నా… హైదరాబాద్ కు వచ్చారు కాబట్టి దయచేసి మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న ప్రాంతాలకు వెళ్లాలని కోరుతున్నా. అట్లాగే ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రాంతానికి వెళ్లాలని కోరుతున్నా. అట్లాగే హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి, సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాలను సందర్శించాలని కోరుతున్నా.
అట్లాగే బాన్సువాడలో అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వేసిన బాధిత కుటుంబాలను పరామర్శించాలని కోరుతున్నా. అమాయకులైన శ్రీనివాస్ లాంటి వాళ్లను దాడులతో సంబంధం లేకుండా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తెలంగాణలో విద్యాశాఖకు, హోంశాఖకు మంత్రే లేరు. ముఖ్యమంత్రే తన వద్ద పెట్టుకున్నారు. మరి వాస్తవ సమాచారం అందుతుందా? లేదా?
మజ్లిస్ పార్టీ మెప్పు పొందడానికి, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామనే అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒవైసీకి తొత్తుగా మారారు. హైదరాబాద్ లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సర్వేలు తేల్చడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలను వాయిదా వేశారు.
బాన్సువాడలో జరిగిందేమిటి? ఎవరు ఎవరి ప్లేస్ లోకి వచ్చి దాడులు చేశారనే విషయంపై వాస్తవ సమాచారం తెలుసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి… ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటానికి హిందువులపై అనేక అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో వేయడం దుర్మార్గం. చాలా మంది కూలీనాలీ చేసుకునే యువకులు పోలీసుల వేధింపులకు తాళలేక ఇళ్లను వదిలి పారిపోయారు. ఆరోగ్యం బాగాలేకపోయినా, మాటలు వినబడకపోయినా వీడియోలో కన్పించారనే ఒకే ఒక్క కారణంతో అమాయకుడైన శ్రీనివాస్ ను అన్యాయంగా పట్టుకుపోయి జైల్లో వేయడం సిగ్గు చేటు.
హిందూ సమాజానికి విజ్ఝప్తి చేస్తున్నా. మీరంతా జాగ్రుతం కావాల్సిన సమయం ఆసన్నమైంది. హిందువులంతా రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్, ఎంఐఎంలకు బుద్ది చెబుదామా? లేక వాళ్ల ముందు బిచ్చపు బతుకులు బతుకుదామా? ఆలోచించండి.
బొట్టు పెట్టుకుని దేవుడిని మొక్కేవాడు మాత్రమే హిందువు కాదు. ఏ దేవుడి కరుణా కటాక్షాలతో బతుకుతున్నామో… అదే దేవుడి ఆలయాలపై, విగ్రహాలపై దాడులు చేస్తున్నా స్పందించకపోవడం, అడ్డుకోని వాళ్లు హిందువులు ఎట్లా అవుతారు? పెద్దమ్మ గుడిపై దాడులు చేస్తే అడ్డుకుంటే లాఠీఛార్జ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బాన్సువాడలో అమాయకులను అరెస్ట్ చేసి జైల్లో వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. ఇంత ఘోరమా? ఇంత అరాచకమా? అయినా ఇంకెంత కాలం భరిద్దాం?
నేను ఇతర మతాల జోలికి వెళ్లను. హిందువుగా మాట్లాడుతున్నా. హిందువులపైన, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నా. నేను హోంశాఖ సహాయ మంత్రినైనా సరే… హిందువుగానే మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వ హిందూ వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయాలకు అతీతంగా కాషాయ జెండాను పట్టుకుని ఐక్యంగా హిందూ వ్యతిరేక విధానాలపై పోరాడదాం రండి. లేనిపక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతాం.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలందరికీ 4 కోట్లు ఇండ్లు కట్టి పోటీపడుతుంటే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పేదల ఇండ్లను కూల్చడంలో పోటీ పడుతోంది. బఫర్ జోన్లు, ఎఫ్ టీఎల్ పేరుతో పేదల ఇండ్లను కూలుస్తూ… పెద్దల ఇండ్లు కట్టినా వాళ్లతో బేరసారాలకు దిగుతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా… బఫర్ జోన్లో, ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఎంత మంది పేదల ఇండ్లు కూల్చారు? ఎంత మంది పెద్దల, రాజకీయ పార్టీ నేతల ఇండ్లను కూల్చారో చెప్పండి. మూసీ పరిధిలో రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడతామని చెబుతూ… పేదల ఇండ్లను కూలుస్తుంటే ఆ మహాత్మాగాంధీ ఆత్మ ఘోషిస్తోంది. మోదీ ప్రభుత్వం గుజరాత్ లో అతి భారీస్థాయిలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని కట్టి ప్రపంచ ప్రజల మనసును దోచుకుంటే… రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గాంధీ విగ్రహం పేరుతో పేదల ఉసురు తీసుకుంటోంది.
ఖమ్మంలో పేదలు నిర్మించుకున్న వందల కుటుంబాలను అన్యాయంగా కూల్చేశారు. ఆ ఇండ్లలో టెన్త్, ఇంటర్ పరీక్షలకు ప్రిపేరవుతున్న విద్యార్థులపై కూడా కనికరం చూపకుండా దుర్మార్గంగా ఇండ్లను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం… హైదరాబాద్ లోని ఒవైసీ అక్రమంగా నిర్మించిన ఫాతిమా కాలేజీని కూల్చేయాలని మేం డిమాండ్ చేస్తే… ఆ విద్యార్థులకు పరీక్షలున్నాయి. వాళ్ల భవిష్యత్తు దెబ్బతింటుందని సాకులు చెప్పి ఆపారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్రుష్టిలో ఫాతిమా కాలేజీ విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తు ఉందా? ఖమ్మంతోపాటు ఇతర ప్రాంతాల్లోని పేద పిల్లలకు భవిష్యత్తు లేదా? ఇష్టానుసారం కూల్చేస్తారా? పేదల ఇండ్లను కూలుస్తూ…పెద్దలిచ్చే పైసలతో జల్సాలు చేయడమే కాంగ్రెస్ నేతల పనా? రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందా? పేదలు రాత్రి పూట పడుకుంటే బుల్డోజర్లు కన్పిస్తున్నాయి. ఎప్పుడు ఇల్లు కూలుస్తారోననే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా… మీరు బఫర్ జోన్లు, ఎఫ్ టీఎల్ పేరుతో ఇకపై పేదల ఇండ్లను కూల్చాలనుకుంటే… అదే ప్లేస్ లో కట్టిన పెద్దల ఇండ్లను, కాంగ్రెస్ నేతల ఇండ్లను కూల్చేసేందుకు బుల్డోజర్లతో వస్తాం. తాడోపేడో తేల్చుకుంటాం. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
రాష్ట్ర ప్రజలంతా ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుంటే… ఆ హామీలను గాలికొదిలేసి ఏఐసీసీ పెద్దలకు మూటలు అప్పగించడంపైనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్రుష్టి పెట్టింది. ప్రజల ద్రుష్టిని దారి మళ్లించేందుకు కేసీఆర్ కుటుంబంపై విచారణ, పేదల ఇండ్ల కూల్చివేత పేరుతో డ్రామాలాడుతున్నారు. 6 గ్యారంటీలపై బీజేపీ నిలదీస్తుంటే… కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడలు పేరుతో భయభ్రంతులకు గురి చేయాలనుకుంటోంది. బీజేపీ కార్యకర్తల ఓపికను చేతగాని తనంగా భావిస్తే కాంగ్రెస్ కే నష్టం. కామారెడ్డిలో బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో రాష్ట్ర ప్రభుత్వానికి అంతకు మించి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్రంతోపాటు 20 రాష్ట్రాల్లో మేం అధికారంలో ఉన్నాం. మేం తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఇండ్ల నుండి బయటకు కూడా రాలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొని ఎందాకైనా పోరాడేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారు.
అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకుంటే ఏ దేశంతో యుద్దం భారత్ కు యుద్దం వస్తుందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. పిచ్చి కూతలు కూస్తున్న రాహుల్ గాంధీ…. కాంగ్రెస్ తోనే ప్రజలు యుద్దం చేస్తున్న విషయాన్ని మర్చిపోయారు. ప్రజలు కాంగ్రెస్ ను దేశవ్యాప్తంగా బొంద పెట్టారు. మూడు రాష్ట్రాలకే పరిమితం చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కరీంనగర్ లోనూ కాంగ్రెస్ ను ఖతం చేసి మేయర్ సీటును బీజేపీ కైవసం చేసుకుందని తెలుసుకుని మాట్లాడాలన్నారు.


