తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి….
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 2.
(అఖండభూమి న్యూస్):
పచ్చిమాసియా దేశాలలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో ఆయా దేశాలలో ఉన్న తెలుగు ప్రజలంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ వాతావరణం పలు దేశాల విమానాశ్రయాలను మూసివేసిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఇరాన్, దుబాయ్ తదితర దేశాలలో చెప్పుకున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పాటించాలని కోరారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. అత్యవసర పరిస్థితులలో ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకొని, ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, భారతదేశానికి తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ని కోరారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


