ఇకనుండి అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు….

ఇకనుండి అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు….

అన్ని ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్లోనే అందుబాటు….

దశలవారీగా కుల, నివాసన వంటి ధ్రువీకరణ పత్రాలు సులువుగా జారీ చేసే విధానం….

ప్రజల ఇబ్బందులను దూరం చేసేలా ప్రభుత్వ విధానాలు….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 3.

(అఖండభూమి న్యూస్):

చదువు, ఉద్యోగాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే మీ సేవలో దరఖాస్తు చేసుకొని, అనంతరం ఆ దరఖాస్తు జతచేసిన ఆధార్, రేషన్ కార్డు, ఇతర పత్రాలతో రెవిన్యూ కార్యాలయాలకు వెళ్లి, సిబ్బందిని బతిమాలే రోజులు త్వరలోనే దూరం కానున్నాయి. మీ సేవ కేంద్రం ద్వారా అప్లోడ్ చేసిన పేపర్ల ఆధారంగా ఎక్కడికి వెళ్లకుండానే సర్టిఫికెట్లు జారీ చేసే పారదర్శక సేవలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత అత్యవసరంగా భావించే ఆదాయ ధ్రువీకరణ పత్రం ప్రారంభం కాగా, దశలధారిగా కులం, నివాస వంటి ధ్రువపత్రాలు సులువుగా జారి చేసే విధానం అందుబాటులోకి తీసుకురానున్నారు. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ కార్యాలయాలకు అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఇదే అదునుగా అక్కడ కొంతమంది సిబ్బంది అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, అన్ని సవ్యంగానే ఉన్న చైత్రం తడిపడితే సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని ఆరోపణలు అనేకం ఉన్నాయి. మీసేవ ద్వారా దరఖాస్తు సమర్పించిన తిరిగి కార్యాలయానికి వెళ్లి, రెవిన్యూ సిబ్బంది వద్దకు పరువు పెడుతున్న తరుణంలో దరఖాస్తుదారుల ఇబ్బందులను దూరం చేసేలా ప్రభుత్వ కొత్త విధానం ఊరటనివ్వనుంది. మీ సేవ ద్వారా దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తు కొలుత గ్రామ రెవెన్యూ పాలెం పాలనాధికారి (జిపిఓ) కి లాగిన్ వస్తుంది. ఆయన విచారణ అనంతరం మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ (ఎమ్మారై) కి, తదనంతరం ఆర్ఐ నేరుగా డిప్యూటీ తాసిల్దార్ (డీటీ) లాగిన్ కు చేరవేస్తారు. ఆన్లైన్లోనే ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తుంటారు. దీంతో రెవిన్యూ సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం చేసే వీలు ఉండదనేది ప్రభుత్వ అభిప్రాయం. ఇప్పటికే అనేక చోట్ల ఆదాయ ధ్రువీకరణపత్రాన్ని ఆన్లైన్లో ధృవీకరించే ప్రక్రియ మొదలయింది. అదిలాబాద్ జిల్లా మీ సేవల విభాగం మేనేజర్ బండి రవి చెప్పారు. ఇటీవల ఐఏఎస్ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలు ఇంటి నుండే ఆన్లైన్ ద్వారానే అన్ని సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తేవాలని అధికారులందరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విద్యుత్ మీటర్, ఇంటి నిర్మాణానికి అనుమతి, కులాయి కలెక్షన్ ప్రభుత్వం నుండి పొందాల్సిన అనుమతుల సేవలకు ప్రజలు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఫైల్, ఏ అర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తు చేసిన వ్యక్తి తెలుసుకునే విధంగా సులభమైన పద్ధతులను ఉండాలని అన్నారు. రైతుల భూ సమస్యలు వేగంగా పరిష్కరించే విధంగా ఉండాలని సూచించారు.

సమూల మాట్లతో సాంకేతిక సంస్కరణలను అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జయష్ రంజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూడు వారాల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించాలని దశాదిశా నిర్దేశం చేశారు. ప్రతి విభాగం ఈ కార్యాలయం విధానం, డిజిటల్ గవర్నర్స్ అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాతకాలం సర్వాలను వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా క్లారిటీతో అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. మహాలక్ష్మి రేషన్ కార్డులు, 500 కు వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ చేరాలని సూచించారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

Akhand Bhoomi News

error: Content is protected !!