మరో నాలుగు ఐదు వారాలు ఇరాన్తో యుద్ధం కొనసాగుతోంది….

మరో నాలుగు ఐదు వారాలు ఇరాన్తో యుద్ధం కొనసాగుతోంది….

తొలిసారిగా అమెరికా సైనికులు మరణించినట్లు నిర్ధారణ…

అమెరికా అధ్యక్షులు ట్రంప్….

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 3.

(అఖండభూమి న్యూస్):

మరో నాలుగు ఐదు వారాలు ఇరాన్ దేశంతో యుద్ధం కొనసాగుతోందని అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ తో జరిగిన యుద్ధంలో అమెరికా సైనికులు మరణించినట్లు తొలిసారిగా ధృవీకరించారు. సైనిక చర్య పూర్తిస్థాయిలో కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న సైనిక ఘర్షణ సుమారు నాలుగు ఐదు వారాల్లో ముగియవచ్చని ఆయన అంచనా వేశారు. ఇదే సమయంలో ఆపరేషన్ ఫ్యూరీ అనే ఈ సైనిక చర్యలో తొలిసారిగా అమెరికా సైనికులు మరణించినట్లు ఆయన ధ్రువీకరించారు. మరోవైపు ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలు విడుదల చేశారు. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా అమెరికాకు నష్టం వాటిలినట్లు ఆయన అంగీకరించారు. కువైట్ లోని స్థావరంలో ఉన్న అమెరికా సైనికులలో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు విఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇది చాలా పెద్ద దేశం అందుకే దీనికి నాలుగు వారాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టదు అని ట్రంప్ పేర్కొన్నారు. అన్వాయిదాలు సంపాదించకుండా ఇరానును నిరోధించడం, వాదానికి మద్దతు ఇవ్వకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ తో కలిసి ఈ సైనిక చర్య చేపట్టినట్లు ట్రంప్ వివరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ కమెని మరణం తర్వాత ఏర్పడిన కొత్త నాయకత్వంతో చర్చలు జరపడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలు విడుదల చేశారు. వారు చర్చలు కోరుకుంటున్నారు, దానికి అంగీకరించాను అని ఆయన చెప్పారు. సైనిక చర్య పూర్తిస్థాయిలో కొనసాగుతుందని, ఉద్దేశిత లక్ష్యాలు పూర్తయ్యే వరకు దాడులు ఆగమని మరోమారు స్పష్టం చేశారు. ఈ ఘర్షణకు మరిన్ని ప్రాణనష్టాలు జరిగే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించడం గమనార్హం. ఇరాన్ దేశంతో అమెరికాకు ఎప్పటికైనా ముప్పు ఉందని అన్నారు. మా హెచ్చరికలను ఇరాన్ బేకార్ చేసినందుకే ఈ యుద్ధం జరుగుతోందని తెలిపారు. వాళ్ల వద్ద అమెరికాను టార్గెట్ చేయగల మిసైల్స్ ఉన్నాయని పునరుద్ఘతుంచారు. ఇరాన్ మిసైల్ వ్యవస్థను నాశనం చేయడమే అమెరికా, ఇజ్రాయిల్ దేశాల లక్ష్యం అని ట్రంపు ప్రకటించారు….

Akhand Bhoomi News

error: Content is protected !!