కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు – ప్రజాప్రతినిధుల చొరవతో రామళ్లకోట వంక శుభ్రత
వెల్దుర్తి ఏప్రిల్ 12 (అఖండ భూమి వెబ్ న్యూస్ ) :
వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న వంకలో పేరుకుపోయిన చెత్తచెదారం కారణం
గా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించారు.
ఇటీవల ఒక పత్రికలో వచ్చిన కథనానికి స్పందనగా శనివారం మాజీ ఎంపీపీ, మండల టిడిపి నాయకులు ఎల్.ఈ. జ్ఞానేశ్వర్ గౌడ్ ముందుకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వంకలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా వంకలో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామ ప్రజలు ఈ చర్యపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్


