కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్

శ్రీశైలం అఖండ భూమి న్యూస్ ఏప్రిల్ 11
శ్రీశైలం మండలం సున్నిపెంటలో టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతి బా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టిడిపి కార్యకర్తలు
సున్నిపెంట అఖండ భూమి న్యూస్ ఏప్రిల్ 11
సమాజంలో కుల నిర్మూలనకు, అలాగే మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతి భా పూలే చేసిన సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామకమిటీ అధ్యక్షుడు సుభాని తెలిపారు. శనివారం మహాత్మా జ్యోతి భా పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా వేడుకలను నిర్వహించారు. సున్నిపెంట అంబేద్కర్ సెంటర్ నందు మహాత్మా జ్యోతి భా పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి సున్నిపెంట గ్రామ కమిటీ అధ్యక్షుడు సుభాన్ టిడిపి నాయకులు మాట్లాడుతూ సమాజంలో విద్యా విస్తరణ కోసం పూలే చేసిన కృషి మరువలేనిదని సుభాన్ అన్నారు. మహిళా విద్యకు పునాది వేసిన ఆయన, తన భార్య సావిత్రి భాయి పూలే తో కలిసి తొలి బాలికల పాఠశాలను స్థాపించిన మహనీయుడని ఆయన సేవలను కొనియాడారు. 1873లో స్థాపించిన ‘సత్యశోధక సమాజ్’ ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన నిరంతరం పోరాటం సాగించారని అన్నారు. పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జింక గుండయ్య గాదం మల్లేష్ ఉమా మహేశ్వరరావు బిజెపినాయకులు గెల్లి వెంకటేశ్వర్లు ఆదిత్య మల్లికార్జున తదితర టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


