భారతదేశంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిగా పేరెన్నికగన్న వాసన్ ఐ కేర్ ఆసుపత్రి ఇప్పుడు రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo

పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వాసన ఐ కేర్ హాస్పిటల్ ఉందని హాస్పిటల్ వైద్యులు అన్నారు. భారతదేశంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిగా పేరెన్నికగన్న వాసన్ ఐ కేర్ ఆసుపత్రి ఇప్పుడు రాజమండ్రిలో తన కొత్త బ్రాంచ్ ను ప్రారంభించింది. సీలాం సూకరాజు కంపెనీ రోడ్డులోని బొ బొల్లినేని హాస్పిటల్ సమీపంలో ఈ నూతన బ్రాంచ్ ను శనివారం ప్రారంభించారు. రాజమండ్రి, పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక, అందుబాటులో ఉండే సమగ్ర కంటి చికిత్స సేవలను అందించడం లక్ష్యంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఏ ఎస్ జి ఐ హాస్పిటల్స్ నెట్వర్క్ కు చెందిన వాసన్ ఐ కేర్ హాస్పిటల్ దేశవ్యాప్తంగా 87 నగరాలలో 172 కంటే ఎక్కువ శాఖలతో బలమైన స్థానం సంపాదించుకుంది. రెండు దశాబ్దాల కంటే ఎక్కువ అనుభవంతో, అత్యాధునిక సాంకేతికత మరియు నిపుణులైన వైద్యులతో ఉన్నత ప్రమాణాల చికిత్సను అందిస్తూ పేరు పొందింది. రాజమండ్రి
శాఖ ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన కంటి సంరక్షణ సేవలను మరింత విస్తరించడానికి ఈ సంస్థ కట్టుబడి ఉంది. కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రంలో ఒకే చోట క్రింది కంటి సంబంధిత వ్యాధులకు ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉంటాయి. కంటిశుక్లం (మైక్రో ఇన్సిషన్ డ పాకో సర్జరీ), గ్లాకోమా నిర్ధారణ, చికిత్స,లాసిక్ మరియు రిప్రాక్టిస్ సర్జరీ, రెటినా సూపర్ స్పెషాలిటీ సేవలు (దయాబెటిక్ రెటినోపతి, కే ఓ పి సహా), కార్నియా మరియు కంటే ఉపరితల వ్యాధులు, పిల్లల కంటి వైద్యం మెల్లకన్ను సరిచేయడం అక్కులోప్లాస్టీ, కాస్మెటిక్ కంటి శస్త్రచికిత్సలు, న్యూరో ఆఫ్తాల్మాలజీ సేవలు, అంబయోపియా నిర్వహణతో పాటు ఆసుపత్రిలో ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక నిర్ధారణ పరికరాలు, అనుభవజ్ఞులైన నేత్ర వైద్యులు, శిక్షణ, పొందిన సిబ్బంది అందుబాటులో ఉండి, రోగులకు నాణ్యమైన భద్రమైన చికిత్సను అందిస్తారు. ఈ సందర్భంగా డా. వరప్రసాద్, డా నేహా కమలిని,
డా. ఉమా మహేశ్వర రావు, డా. మణిమాల మరియు డా. అడపా శ్రీ మోనిక ప్రసంగిస్తూ, కొత్త కేంద్రంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక కంటి సేవలు, రోగి కంటికి సంబంధించిన చికిత్స గురించి వివరించారు. ఈ కొత్త శాఖ ప్రారంభంతో, రాజమండ్రి మరియు సమీప ప్రాంతాల ప్రజలు ఇకపై మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానికంగానే ప్రపంచ స్థాయి కంటి. చికిత్సను అందుబాటులో పొందవచ్చని, అందుబాటు ధరలు, ఇన్సూరెన్స్ క్యాపిటిస్ సౌకర్యాలతో సేవలను అందించడానికి ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవ సందర్భంగా పరిమిత కాలం పాటు ఉచిత కంటి పరీక్షలు, కటారాష్ట్ర శస్త్రపరీక్షలు, కన్సల్టేషన్ ఆఫర్లు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోగులకు నాణ్యమైన, సాంకేతికత ఆధారిత,కంటికి సంబంధించిన కంటి సేవలను అందిస్తూ తన సేవలను కొనసాగిస్తోందని అన్నారు.
You may also like
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్
కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు – ప్రజాప్రతినిధుల చొరవతో రామళ్లకోట వంక శుభ్రత
విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు దీపం”
శివోహం టెంపుల్ ట్రస్ట్ అన్నదాన ప్రసాద,వితరణ,కార్యక్రమం
తాటిమనుపాలెం పాఠశాల అభివృద్ధికి వసంతం ట్రస్ట్ చేయూత


