గ్రామాల అభివృద్ధి కే 99 రోజుల ప్రజా పాలన , ప్రగతి ప్రణాళిక కార్యాచరణ…

గ్రామాల అభివృద్ధి కే 99 రోజుల ప్రజా పాలన , ప్రగతి ప్రణాళిక కార్యాచరణ…

 

మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి ..

గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ పోల్స్ సరి చేయాలి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 15 (అఖండ భూమి న్యూస్);

గ్రామీణ, పట్టణ, నగర అభివృద్ధి కె రాష్ట్ర ప్రభుత్వం 99వ రోజుల ప్రజాపాలన, ప్రణాళిక కార్యచరణ తో అభివృద్ధిలో దూసుకుపోతుందని దోమకొండ మండల ప్రత్యేక అధికారి ఎన్ జ్యోతి , ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం దోమకొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాల సర్పంచులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

వేసవి దృష్ట్యా గ్రామాల్లో రాబోయే మూడు నెలల పాటు మంచినీటి సమస్యలు తలెత్తకుండా ఆయా గ్రామ పంచాయతీల వారీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని సూచించారు. గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల సభను నిర్వహించారు . ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మండల సభలో దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా తీసుకోవడం చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. వేసవి కాలంలో మంచినీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ మరియు మిషన్ భగీరథ అధికారులు గ్రామాల్లోని సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సమస్య లేకుండా చూడాలని తెలిపారు అదేవిధంగా ముత్యంపేట్ సంగమేశ్వర్ గ్రామాల్లో ఐరన్ విద్యుత్ పోల్స్ వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కావున వాటి స్థానంలో వేరే వాటిని ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు విద్యుత్ అధికారులను కోరారు అదేవిధంగా గ్రామాల్లో నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల నివాసాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు ప్రజాప్రతినిధులు ఏవైనా సమస్యలు గుర్తించినట్లయితే మండల అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు సీతారాం పల్లి గ్రామానికి విద్యుత్ లైన్ అంచనూర్ గ్రామం తో అనుసంధానమై ఉండడంవల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ తెలిపారు అదే విధంగా సీతారాంపల్లి గ్రామంలో రేషన్ షాప్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. సీతారాం పల్లి గ్రామంలో రేషన్ షాప్ గురించి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు సమర్పించామని తాసిల్దార్ పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని ఎం జ్యోతి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎన్ ప్రవీణ్ కుమార్ తాసిల్దార్ సుధాకర్ ఎస్సై ప్రభాకర్ ఎంఈఓ విజయ్ కుమార్ , మండల పంచాయతీ అధికారి రవికుమార్, వ్యవసాయ అధికారి మనిదీపిక ఎక్సైజ్ దీపిక, ఆయా గ్రామాల సర్పంచులు ఐరనీ నరసయ్య, లోయపల్లి శ్రీనివాసరావు , మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్, అనంతరెడ్డి, అబ్రబోయిన స్వామి, అండం శంకర్ రెడ్డి, ఆశ పోయిన అక్షర , పట్నం లక్ష్మి, సంజీవ్ , వెన్నెల భాను శ్రీ , ఆరుట్ల కవిత , జాలిగామ నరేష్, బకారం సిద్ధిరాములు మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సర్పంచులు మహిళా సంఘాల సభ్యులు అంగన్వాడి సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!