కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్ …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 18 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్ కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు. జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్ తో పాటు క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగంలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల పార్టీలోకి రావడం పట్ల టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జనసేన జిల్లా నాయకులు , కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షులు, క్యాషియర్, మాదాస్ రాజలింగం, సెక్రటరీలు పార్టీలోకి రావడం కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి,ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలన బాగుందని అది చూసి మేం పార్టీలో జాయిన్ అవుతున్నామని తెలిపారు .రాబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలుపించుకోనేలా కృషి చేయాలనీ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని అకాంక్షించారు. కాంగ్రెస్ పథకాలు, అభివృద్ధి పనులు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమిల్, కాంగ్రెస్ నాయకులు రంగ రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్,అరుణ్, మెహర్ బాబా గౌడ్,శ్రీకాంత్ ఉన్నారు.



