దోమకొండ చరిత్రాత్మక కట్టడాలపై అవగాహన…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 18 (అఖండ భూమి న్యూస్)
దోమకొండ కోటలో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక కట్టడాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ కోటలో విద్యార్థులు, పిల్లలందరికీ చారిత్రక కట్టడాలపపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని దోమకొండ ఫోర్ట్ & గ్రామ అభివృద్ధి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
విద్యార్థులకు మన దేశానికి, ప్రాంతానికి చెందిన చారిత్రక కట్టడాలు, సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యతను వివరించారు. వారసత్వ సంపదను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ముఖ్యంగా యువత ముందుకు రావాలని ట్రస్ట్ మేనేజర్ బాబ్జి సూచించారు.
కార్యక్రమంలో భాగంగా దోమకొండ కోట చరిత్ర, ప్రత్యేకతలు, నిర్మాణ శైలి గురించి విద్యార్థులకు వివరించడంతో పాటు, వారసత్వ ప్రదేశాలను పరిరక్షించే మార్గాలపై చర్చించారు. పిల్లలు ఆసక్తిగా పాల్గొని అనేక ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు తమ సంస్కృతి, వారసత్వంపై గౌరవాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గణేష్ యాదవ్, వినయ్ రాజశేఖర్, లక్ష్మి ,కల్పన, విద్యార్థులు పాల్గొన్నారు.


