*_ఉపాధి హామీ సిబ్బందికి తీపి కబురు…
*_రూ.కోటి వరకు ప్రమాద బీమా వర్తింపు.
*_వేతన బకాయిల కింద రూ.78కోట్లు విడుదల..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 17 (అఖండ భూమి న్యూస్);
_జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది._
_రాష్ట్రంలోని 3,700మంది సిబ్బందికి రూ.కోటి వరకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించనుంది. కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ పథకం కింద ఎస్‌బీఐ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఉద్యోగి జీతం ఆధారంగా రూ.40లక్షల నుంచి రూ.కోటి వరకు ఈ బీమా వర్తింపచేయనున్నారు. ప్రమాద బీమా కోసం అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వం ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రాష్ట్రంలోని 11,760 మంది ఉపాది హామీ సిబ్బంది జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.78కోట్లు విడుదల చేసింది._
_మరోవైపు ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కూలీల వేతన బకాయిలను చెల్లించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 10నుంచి మార్చి 31వరకు ఉన్న రూ.383కోట్ల వేతన బకాయిలను చెల్లించేందుకుగాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వారం రోజుల్లోగా కూలీల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 20 ఏళ్లుగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయీ్‌సగా(ఎఫ్టీఈ)లుగా గుర్తించాలని, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రాజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్యకు ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు._
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


