మహేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ -2ను ప్రారంభించిన చైర్ పర్సన్

బెల్లంపల్లి మే 17(అఖండ భూమి న్యూస్):బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియం(వన్ గ్రౌండ్)లో ఆదివారం స్టిల్ ఫొటో స్టూడియో యజమాని,ఫొటో గ్రాఫర్ అడిచేర్ల మహేష్ జ్ఞాపకర్థం నిర్వహిస్తున్న”మహేష్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2″కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు.ముందుగా అడిచేర్ల మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ…
అడిచేర్ల మహేష్ జ్ఞాపకార్ధం ప్రతి ఏటా క్రికెట్ లీగ్‌ను నిర్వహిస్తున్న నిర్వాహకులను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మత్తమారి రాయమల్లు,నిచ్చకొల వంశీకృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట రాజలింగు, టోర్నమెంట్ నిర్వాహకులు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు…


