డ్రగ్స్ నియంత్రణకు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు,యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ టీమ్ తో ముమ్మర తనిఖీలు

డ్రగ్స్ నియంత్రణకు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు,యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ టీమ్ తో ముమ్మర తనిఖీలు

 

బెల్లంపల్లి మే20(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో నార్కోటిక్స్ నిపుణులు, డాగ్ స్క్వాడ్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు వినియోగాన్ని అరికట్టేందుకు బెల్లంపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ పర్యవేక్షణలో బుధవారం బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లంపల్లి రైల్వే స్టేషన్,పాన్ షాపులు,ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు,

లగేజీలు పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ నియంత్రణకు డాగ్ స్క్వాడ్,యాంటీ నార్కోటిక్ బృందాలతో కలిసి ముమ్మర తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు,ప్రయాణికుల సామాను,

అనుమానాస్పద పార్సిల్స్ వ్యక్తులను ప్రత్యేకంగా పరిశీలించారు.శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో మాదక ద్రవ్యాల గుర్తింపునకు చర్యలు చేపట్టారు.

ప్రయాణికులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి, అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,నిల్వ మరియు విక్రయాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా నిరోధించడం అలాగే ప్రజల భద్రతను కాపాడడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని,డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా అందించాలని బెల్లంపల్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హానోక్,బెల్లంపల్లి టూ టౌన్ ఎస్‌ఐ.కిరణ్ కుమార్,పోలీసు సిబ్బంది,నార్కోటిక్స్ నిపుణులు డాగ్ స్క్వాడ్ బృందం తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!